సింహాచలంలో ఎండోమెంట్ ధార్మిక శాఖ ఆధ్వర్యంలో శ్రీ వరాహ లక్ష్మీనరసింహస్వామివారి ధర్మ ప్రచార మహోత్సవం నిర్వహించారు. తాడేపల్లిగూడెంలో ధర్మ ప్రచార మహోత్సవంలో భాగంగా ఈ ఘటన జరిగింది. ఈ కార్యక్రమానికి ఉప ముఖ్యమంత్రి, దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ నాయకత్వం వహించారు. కార్యక్రమంలో స్వామి వార్లు, అమ్మవార్లు కల్యాణమూర్తిగా దర్శనమిచ్చి భక్తులకు దివ్య దర్శనం కల్పించారు. వరాహ లక్ష్మీనరసింహస్వామి స్వామివారి కళ్యాణాన్ని సింహాచలం దేవస్థానం నుంచి వేదాంతం రాజగోపాల చక్రవర్తి నేతృత్వంలో వేదపండితులు ఆలయంలో నిర్వహించే విధంగానే నిర్వహించారు.శ్రీ వరాహ లక్ష్మీనరసింహస్వామివారి దివ్య కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగి భక్తులను విశేషంగా ఆకట్టుకుంది.ఈ కార్యక్రమానికి భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై కళ్యాణాన్ని తిలకించారు. కార్యక్రమం అనంతరం ఆలయం నుంచి తీసుకొచ్చిన తీర్థప్రసాదాలు, స్వామివారి కల్యాణం తలంబ్రాలను భక్తులకు పంపిణీ చేశారు.