Breaking Telugu News

News5am, Breaking News Telugu (04-06-2025): హైదరాబాద్‌లో చేప ప్రసాదం పంపిణీ తేదీ ఖరారైంది. జూన్ 8న నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో చేప ప్రసాదం పంపిణీ జరగనుంది. దీనికి సంబంధించిన ఏర్పాట్లను మంత్రి పొన్నం ప్రభాకర్ పరిశీలించారు. చేప ప్రసాదం పంపిణీ కార్యక్రమం ఎలాంటి ఇబ్బందులు లేకుండా జరగేందుకు అధికారులను అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అలాగే, ఫిషరీస్ కార్పొరేషన్ ఛైర్మన్ మెట్టు సాయి కుమార్‌కు కొన్ని సూచనలు చేశారు. ఈ కార్యక్రమానికి అవసరమైన 1.5 లక్షల చేప పిల్లలను ఫిషరీస్ కార్పొరేషన్ సిద్ధం చేసింది.

చేప ప్రసాదం పంపిణీ సమయంలో వచ్చే జన సందోహం, క్యూ లైన్లు, భద్రతా ఏర్పాట్లపై మంత్రి సమీక్ష నిర్వహించారు. పోలీసుల నుంచి అవసరమైన సమాచారం కూడా తెలుసుకున్నారు. ప్రసాదం కోసం వచ్చే ప్రజలకు తాగునీరు, భోజన వసతి వంటి సౌకర్యాలను అందించేందుకు స్వచ్ఛంద సంస్థలకు అవసరమైన సాయం చేయాలని సూచించారు. జూన్ 6వ తేదీ నుంచే ఇతర రాష్ట్రాల నుంచి భక్తులు రానున్న అవకాశముండటంతో, వారికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేయాలని మంత్రి ఆదేశించారు.

More Breaking News Telugu Latest:

News Telugu:

తిరుమల తిరుపతి దేవస్థానం సులభ దర్శనం కోసం AI టెక్నాలజీని ఉపయోగించనుంది

ఓదెలమల్లన్న గుట్టపై రాక్ ఆర్ట్స్..

More Breaking News: External Sources

హైదరాబాద్‌లో చేప ప్రసాదం పంపిణీకి ముహూర్తం ఖరారు.. ఎప్పుడంటే?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *