Giripradakshina at Yadagirigutta: యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి జన్మనక్షత్రమైన స్వాతి నక్షత్రం సందర్భంగా శుక్రవారం దేవస్థానం ఆధ్వర్యంలో సామూహిక గిరిప్రదక్షిణ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. తెల్లవారుజామున 5.30 గంటలకు వైకుంఠ ద్వారం వద్ద భక్తులు నారసింహుడి పాదాలకు ప్రత్యేక పూజలు నిర్వహించి గిరిప్రదక్షిణ ప్రారంభించారు. భక్తులు స్వయంభు నారసింహుడి ఆలయం చుట్టూ కాలినడకన గిరిప్రదక్షిణ చేసి, కొండపై గర్భగుడిలో స్వామివారిని దర్శించుకొని మొక్కులు తీర్చుకున్నారు. దేవస్థానం అధికారులు గిరిప్రదక్షిణలో పాల్గొన్న భక్తులకు ప్రత్యేక దర్శన సదుపాయం కల్పించి స్వామివారి ప్రసాదాన్ని అందజేశారు. భజన బృందాలు చేసిన భక్తిగీతాలు, సంకీర్తనలు, నృత్య ప్రదర్శనలు భక్తులను ప్రత్యేకంగా ఆకట్టుకున్నాయి.
అదే రోజు ఆలయంలో అర్చకులు అష్టోత్తర శతఘటాభిషేక కైంకర్యాన్ని అట్టహాసంగా నిర్వహించారు. స్వాతి నక్షత్రం సందర్భంగా స్వామి, అమ్మవార్లకు ప్రత్యేకంగా 108 వెండి కలశాలతో శుద్ధజలాభిషేకాన్ని చేశారు. ప్రధానాలయ ముఖమంటపంలో స్వర్ణధ్వజస్తంభానికి ఎదురుగా కలశాలను పేర్చి, వేదపండితుల మంత్రోచ్ఛారణల మధ్య ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆ మంత్రజలంతో స్వామివారికి అర్చనాభిషేకాలు నిర్వహించి ఉత్సవాన్ని భక్తిశ్రద్ధలతో జరిపారు.
Internal Links:
వైభవంగా ప్రారంభమైన శ్రావణమాస మహోత్సవాలు..
తిరుమలలో ఇకపై ఈ భక్తులకు గదుల కేటాయింపు రద్దు..
External Links:
స్వాతి నక్షత్రం సందర్భంగా .. యాదగిరీశుడి కొండ చుట్టూ ‘గిరిప్రదక్షిణ’