Krishna Janmashtami

Krishna Janmashtami: దేశవ్యాప్తంగా శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు జరుపుకుంటున్నారు. ఇస్కాన్ ఆలయాలకు భక్తులు భారీ సంఖ్యలో తరలివస్తున్నారు. చిన్నారులు శ్రీకృష్ణుడు, గోపికల వేషధారణలో అందరినీ ఆకట్టుకుంటున్నారు. మధ్యప్రదేశ్ గ్వాలియర్‌లోని 105 ఏళ్ల గోపాల్ మందిరంలో రాధా-కృష్ణులను రూ.110 కోట్ల విలువైన ఆభరణాలతో అలంకరించారు. బంగారు కిరీటం, వజ్రాలు, విలువైన ఆభరణాలు ధరించిన రాధా-కృష్ణుల రూపం భక్తులను మంత్ర ముగ్ధులను చేస్తోంది. జన్మాష్టమి సందర్భంగా సెంట్రల్ బ్యాంక్ లాకర్‌లో ఉన్న ఆభరణాలను ఆలయానికి తీసుకువచ్చి విగ్రహాలను అలంకరించారు.

రాధా-కృష్ణుల విగ్రహానికి కఠినమైన భద్రతను కల్పించారు. ఆలయంలో 200 మంది పోలీసులు, CCTV కెమెరాలను ఏర్పాటు చేశారు. ఈ ఆభరణాలను 1921లో సింధియా మహారాజు మాధవరావు సింధియా తయారు చేయించారు. ఈ జాబితాలో తెల్ల ముత్యాల హారం, ఏడు తీగల హారం, బంగారు కిరీటం, వజ్రాలతో చేసిన కంకణాలు, బంగారు వేణువు, 249 ముత్యాల హారం, పుష్పరాగం, రూబీలు పొదిగిన 3 కిలోల కిరీటం, బంగారు ముక్కుపుడక ఉన్నాయి. భక్తులు ఈ ఆభరణాలను చూసి ఆశ్చర్యపోతున్నారు.

Internal Links:

నేడు వరలక్ష్మీ వ్రతం..

భారతీయ సంస్కృతిలో రాఖీ పండుగకు ప్రత్యేక ప్రాముఖ్యత..

External Links:

బంగారు కిరీటం, వజ్రాలు పొదిగిన.. రూ. 110 కోట్ల విలువైన ఆభరణాలతో అలంకరించబడ్డ రాధా-కృష్ణులు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *