News5am, Latest Telugu News (09-06-2025): హైదరాబాద్ – సికింద్రాబాద్ జంట నగరాలు ఆషాఢ బోనాల పండుగకు సిద్ధమవుతున్నాయి. జూన్ 26 నుంచి బోనాల వేడుకలు ప్రారంభమై నెలరోజుల పాటు కొనసాగనున్నాయి. తొలుత గోల్కొండ జగదాంబ మహంకాళి ఆలయంలో బోనం సమర్పిస్తారు. నగరంలోని 28 ప్రముఖ ఆలయాల్లో బోనాలు నిర్వహించనున్నారు. ఆలయాలకు వచ్చే భక్తుల కోసం తాగునీటి సౌకర్యం, చలువ పందిళ్లు, ప్రత్యేక క్యూలైన్లు, ట్రాఫిక్ నియంత్రణ కోసం ఏర్పాట్లు చేస్తున్నారు. పూర్వంలో జరిగిన పొరపాట్లు పునరావృతం కాకుండా ప్రభుత్వం ముందస్తుగా అన్ని చర్యలు చేపడుతోంది. మంత్రి కొండా సురేఖ, కమిషనర్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. ఆలయ అధికారులతో సమీక్ష సమావేశాలు కూడా జరగనున్నాయి.
జులై 1న బల్కంపేట ఎల్లమ్మ ఆలయంలో బోనాలు నిర్వహించనున్నారు. అలాగే జూలై 13,14 తేదీల్లో సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి ఆలయం, 20,21 తేదీల్లో లాల్ దర్వాజా సింహవాహినీ ఆలయం, నాచారం మహంకాళేశ్వర ఆలయాల్లో బోనాల ఉత్సవాలు జరుగుతాయి. రాష్ట్ర ప్రభుత్వం బోనాల ఏర్పాట్ల కోసం రూ.20 కోట్లు మంజూరు చేసింది. ఈ నిధులతో భక్తుల కోసం మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నారు. ఆలయాల గ్రేడ్‌ను బట్టి దేవాదాయశాఖ నిధులు విడుదల చేసింది. వేడుకల్లో ఎలాంటి అంతరాయం లేకుండా అధికారులు పకడ్బందీ ప్రణాళికలు రూపొందిస్తున్నారు.
More Art and Culture News:
Today Telugu News:
అయోధ్యలో రామ దర్బార్ ప్రాణ ప్రతిష్ట..
More Cultural Telugu News: External Sources
హైదరాబాద్-సికింద్రాబాద్ బోనాల పండుగ.. 26 నుంచి బోనాలు