Secunderabad Laskar Bonalu

Secunderabad Laskar Bonalu: తెలంగాణలో బోనాల జాతర అంగరంగ వైభవంగా కొనసాగుతోంది. ఇప్పటికే గోల్కొండ బోనాలు ముగిసినప్పటికీ, సికింద్రాబాద్‌లో లష్కర్ బోనాల ఉత్సవానికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. జూలై 13న ఉజ్జయిని మహంకాళమ్మకు లష్కర్ బోనం సమర్పించనుండగా, జూలై 20న లాల్‌దర్వాజ సింహవాహిని అమ్మవారి బోనాల వేడుకలు జరగనున్నాయి. రేపు తెల్లవారుజామునే వేలాది భక్తులు మహంకాళి ఆలయానికి తరలిరానున్నారు. మహిళల కోసం ప్రత్యేక క్యూలైన్లు ఏర్పాటు చేశారు. సాయంత్రం ఘటాల ఊరేగింపు జరగనుండగా, జూలై 14న రంగం, ఫలహారం బండ్ల ఊరేగింపు జరుగనుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదివారం అమ్మవారికి లష్కర్ బోనం సమర్పించనున్నారు. ఈ కార్యక్రమాలను జిల్లా కలెక్టర్, దేవాదాయ శాఖ, GHMC, పోలీస్‌ అధికారులు సమన్వయంతో నిర్వహిస్తున్నారు. ప్రత్యేక తెలంగాణ ఏర్పడిన తర్వాత బోనాల జాతరలను రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తోంది.

తెలంగాణ వ్యాప్తంగా బోనాలను భక్తులు స్థానిక ఆచార సంప్రదాయాల ప్రకారం నిర్వహిస్తున్నారు. రేణుకాఎల్లమ్మ, మల్లమ్మ తల్లి, పోచమ్మ, పెద్దమ్మతల్లి, ముత్తాలమ్మ, మారెమ్మ, మైసమ్మ, గండి మైసమ్మ వంటి గ్రామ దేవతలకు బోనాలు సమర్పిస్తారు. పసుపు, కుంకుమ, వేపమండలతో అలంకరించిన వెండి, బంగారు లేదా మట్టి పాత్రలను బోనాలుగా తయారుచేసి, దీపారాధనతో తలపై ఎత్తుకొని మహిళలు భక్తిశ్రద్ధలతో ఊరేగింపుగా ఆలయానికి తరలివస్తారు. పట్టుచీరలు, ఆభరణాలతో అలంకరించి అమ్మవారికి బోనం సమర్పించే మహిళలు తమ భక్తిని ప్రదర్శిస్తూ లక్ష్మీ దేవిలా కనిపిస్తారు.

Internal Links:

ప్రపంచ జనాభా దినోత్సవం 2025

విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై శాకంబరి ఉత్సవాలు..

External Links:

లష్కర్ బోనాలకు వేళాయే.. జులై 13 నుంచి 15 వరకు సికింద్రాబాద్ లో సండడే సందడి..!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *