తిరుమలలో కొనసాగుతున్నభక్తుల రద్దీ మంగళవారం కూడా ఎక్కువగానే ఉంది. ఎక్కువగా భక్తులు శని , ఆదివారం రద్దీ ఉంటుందేమో అనే భావనతో మిగతావారలలో స్వామి వారిని దర్శించుకోడానికి వస్తున్నారు. శని ఆదివారాలాగే మిగతావారాలలో కూడా భక్తులు పెద్ద ఎత్తున వచ్చి వెంకన్న స్వామిని దర్శించుకుంటున్నారు. దీంతో పాటు సమ్మర్ హాలిడేస్ లో కంటే ఇప్పుడు స్వామి వారిని దర్శించుకుని వెళదామన్న వారి సంఖ్య ఎక్కువగా ఉందని అధికారులు వెల్లడించారు. ప్రస్తుతం ప్రత్యేక దర్శనం టిక్కెట్లు ఆన్లైన్ లో కొనుగోలు చేసిన వారికీ మూడు గంటల సమయం పడుతుంది అని ఆలయ అధికారులు వెల్లడించారు. శ్రీవారి ఆర్జిత సేవ టిక్కెట్ల లక్కీ డిప్ ఈనెల 18న ఉదయం10 గంటల నుండి 20 వ తారీకు వరకు భక్తులు లక్కీ డిప్ ని నమోదు చేస్కోవచ్చు అని టీటీడీ వెల్లడించింది. లక్కీ డిప్ పొందిన భక్తుల 20 వ తారీకు నుండి 22 వ తేదీ మధ్యాహ్నం 12 గంటల లోపు టికెట్ సంబందించిన రుసుము చెల్లించిన వారికీ టీటీడీ టికెట్ మంజూరు చేస్తుంది అని వెల్లడించింది. అలాగే ఈనెల 24 వ తారీకు, అక్టోబర్ కి సంబంధించిన ప్రత్యేక దర్శనం టిక్కెట్ల కోటా ఉదయం 10 గంటలకు టీటీడీ దేవస్థానం వెబ్సైటులో విడుదల చేస్తారు, అలాగే మధ్యాహ్నం 3 గంటలకు తిరుమల మరియు తిరుపతిలో వసతి గదుల బుకింగ్ కోటా విడుదల కానుంది.