తిరుమల శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలకు తిరుమల తిరుపతి దేవస్థానం ముహూర్తం ఖరారు చేసింది. శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలకు రెండు నెలల సమయం ఉన్నందున , అత్యంత వైభవంగా నిర్వహించేందుకు విస్తృత ఏర్పాట్లు చేయాలని టీటీడీ అదనపు ఈవో సీహెచ్ వెంకయ్య చౌదరి అధికారులను ఆదేశించారు. తిరుమల శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు అక్టోబర్ 4 నుంచి 12వ తేదీ వరకు బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం వెల్లడించింది. తిరుమలకు తరలి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు, అసౌకర్యాలు కలగకుండా విస్తృత ఏర్పాటు చేయాలనీ టీటీడీ అదనపు ఈవో సీహెచ్ వెంకయ్య చౌదరి అధికారులను ఆదేశించారు.
అక్టోబర్ 4 న ధ్వజారోహణం
తిరుమల శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా అక్టోబర్ 4 న ధ్వజారోహణంతో శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి.
అక్టోబర్ 8 2024 గరుడ సేవ,
అక్టోబర్ 8 2024 మంగళవారం ఉదయం మోహిని అవతారంలో స్వామి వారు దర్శనం ఇవ్వనున్నారు. రాత్రి గరుడ వాహన సేవ నిర్వహించనున్నారు.
అక్టోబర్ 9న స్వర్ణ రధం
అక్టోబర్ 9న 2024, బుధవారం ఉదయం హనుమంత సేవ సాయంత్రం స్వర్ణ రథోత్సవం నిర్వహించనున్నారు. రాత్రి గజ వాహనం మీద స్వామి వారు భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు.
అక్టోబర్ 11 న స్వర్ణ రధోత్సవం,
అక్టోబర్ 11 న శుక్రవారం ఉదయం రథోత్సవం, సాయంత్రం అశ్వవాహనం మీద వెంకన్న దేవేరులతో కలిసి భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు.
అక్టోబర్ 12న చక్ర స్నానం
అక్టోబర్ 12న శనివారం ఉదయం తెల్లవారుజామున పల్లకి ఉత్సవం, తిరుచ్చి ఉత్సవం నిర్వహించనున్నారు. ఉదయం స్వప్న తిరుమంజనం అనంతరం చక్ర స్నానంతో బ్రహ్మోత్సవాలు ముగియనున్నాయి.