రాజరాజేశ్వర క్షేత్రం ఆదివారం భక్తులతో కిటకిటలాడింది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు తొలుత ధర్మగుండంలో పుణ్యస్నానాలు ఆచరించారు. కోడెమొక్కకు తలనీలాలు చెల్లించి ప్రత్యేక పూజలు చేశారు.
క్యూలైన్ల ద్వారా ఆలయంలోకి ప్రవేశించి శ్రీస్వామివారిని దర్శించుకున్నారు. శ్రావణ మాసం కావడంతో భక్తుల రద్దీ దృష్ట్యా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. సోమవారం స్వామిని దర్శించుకునేందుకు పెద్దసంఖ్యలో భక్తులు వేములవాడ చేరుకున్నారు.