ఆదిలాబాద్‌లోని ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్‌లోని నాగోబాను తెలంగాణ ముఖ్యమంత్రి అనుముల రేవంత్‌రెడ్డి దర్శించుకున్నారు. మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, కొండా సురేఖ, సీతక్క, డిప్యూటీ సీఎం విక్రమార్కతోపాటు పలువురు ఎమ్మెల్యేలతో కలిసి ఆయన నాగోబా ఆలయంలో ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. ముఖ్యమంత్రి హోదాలో తన తొలి జిల్లా పర్యటన సందర్భంగా రేవంత్ రెడ్డి ప్రసంగిస్తారని మంత్రి సీతక్క ఇప్పటికే వెల్లడించారు. ముఖ్యంగా ఆరు హామీల అమలు, ఇంద్రవెల్లి అమరవీరుల స్థూపానికి నివాళులు అర్పించే సందర్భాన్ని దృష్టిలో ఉంచుకుని రేవంత్ రెడ్డి ప్రసంగం ఎలా ఉంటుందోనని ప్రజల్లో ఆసక్తి నెలకొంది.