పాపికొండల యాత్ర నేటి నుంచి ప్రారంభం కానుంది. పాపికొండల యాత్ర కోసం పర్యాటకులు ఎంతగానో ఎదురు చూస్తుంటారు. భారీ వర్షాలకు గోదావరి నది ఉప్పొంగడంతో కొంత కాలం నుంచి పాపికొండల విహార యాత్రను ప్రభుత్వం నిలిపివేసిన సంగతి తెలిసిందే. దీంతో పాపికొండలను బోట్ల ద్వారా చూడాలనుకున్నవారు నిరాశకు గురయ్యారు. భద్రాచలం నుంచి రాజమండ్రి వరకూ, రాజమండ్రి నుంచి భద్రాచలం వరకూ ఈ యాత్ర సాగనుంది.
అయితే ప్రస్తుతం గోదావరి నీటి మట్టం నిలకడగా సాగనుండటంతో నాలుగు నెలల తర్వాత పాపికొండల యాత్ర ప్రారంభం నేటి నుంచి టూర్ ను తిరిగి ప్రారంభించింది. ఇందుకోసం టూరిజం శాఖ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దేవీపట్నం మండలం పోచమ్మ గండి నుంచి టూరిజం బోట్లు బయల్దేరనున్నాయి. దీంతో పర్యాటకులతో పాటు బోటు యజమానులు కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. బోటింగ్ కు పెద్దలకు రూ.950, పిల్లలకు రూ.750 చొప్పున టికెట్ ధర నిర్ణయించారు. ఏపీ, తెలంగాణ టూరిజం శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక టూర్ ప్యాకేజీలను ఆపరేట్ చేస్తున్నారు.