బంగారం ధరలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. గోల్డ్ ప్రియులకు పెరుగుతున్న ధరలు ఊహించని షాక్ ఇస్తున్నాయి. వందలు, వేలల్లో ధరలు పెరుగుతూ పసిడి కొనాలన్న ఆలోచన కూడా రాకుండా చేస్తున్నాయి. బంగారం ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. గత కొద్ది రోజులుగా పైకి ఎగబాకుతున్న గోల్డ్ ధరలు నేడు మళ్లీ పెరిగాయి. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 200 పెరిగింది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 330 తగ్గింది.
హైదరాబాద్ ఈరోజు 24 క్యారెట్ల బంగారం ధర (1 గ్రాము) రూ. 8,777, 22 క్యారెట్ల బంగారం ధర (1 గ్రాము) రూ. 8,045 వద్ద ట్రేడ్ అవుతోంది. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.80,450కి చేరింది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.87,770 వద్ద ట్రేడ్ అవుతోంది. హైదరాబాద్ మార్కెట్ లో వెండి ధరలు భారీగా తగ్గాయి. కిలో వెండిపై ఏకంగా రూ. 900 తగ్గింది. నేడు కిలో సిల్వర్ రూ. 1,07,000 వద్ద అమ్ముడవుతోంది. మొత్తానికి బంగారం ధరలు లక్షకు చేరువవుతుండడం, సిల్వర్ ధరలు లక్ష దాటి పరుగెడుతుండడంతో సామాన్యులు బెంబేలెత్తుతున్నారు.