gold silver

August 29 18k 22k 24k Gold Prices: వరుసగా పెరిగి సామాన్య, మధ్యతరగతి ప్రజలకు అందని ద్రాక్షలా మారిన బంగారం ధరలు తాజాగా తగ్గుముఖం పట్టాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.2,890 తగ్గి రూ.1,58,240కు చేరగా, 22 క్యారెట్ల బంగారం రూ.2,650 తగ్గి రూ.1,45,050కు చేరింది. 18 క్యారెట్ల బంగారం ధర కూడా రూ.2,170 తగ్గి 10 గ్రాములకు రూ.1,18,680గా నమోదైంది. వెండి ధర కిలోకు రూ.5,000 తగ్గి రూ.2.60 లక్షలకు చేరింది. ఆగస్టు 28తో పోలిస్తే దేశవ్యాప్తంగా బంగారం ధరలు తగ్గాయి. చెన్నై, ముంబై, కోల్‌కతా, బెంగళూరు, హైదరాబాద్‌లో 24 క్యారెట్ల బంగారం గ్రాము ధర రూ.15,824గా ఉండగా, ఢిల్లీలో రూ.15,839గా ఉంది.

అంతర్జాతీయ పరిణామాలు, పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్తతల కారణంగా బంగారం, వెండి ధరల్లో రోజువారీ హెచ్చుతగ్గులు కనిపిస్తున్నాయి. హోర్ముజ్ జలసంధి అంశంపై ఇరాన్, అమెరికా మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతలు ప్రపంచ చమురు మార్కెట్లతో పాటు విలువైన లోహాల ధరలపై కూడా ప్రభావం చూపుతున్నాయి. దీంతో బంగారం, వెండి ధరల్లో రాబోయే రోజుల్లో మరిన్ని మార్పులు చోటుచేసుకునే అవకాశం ఉంది.

News5am is a digital news platform that delivers crisp and reliable updates. It provides timely coverage of current affairs, sports, entertainment, business, and technology”.

Internal Links:

అమెరికా మళ్లీ యుద్ధం మొదలుపెట్టింది…

ప్రధాని మోదీకి ఇథియోపియా అత్యున్నత పురస్కారం..

External Links:

పసిడి ప్రియులకు గుడ్‌న్యూస్‌.. మరోసారి భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *