Banks Open on Sunday: సెప్టెంబర్ 28 నుంచి 30 వరకు బ్యాంకు ఉద్యోగ సంఘాలు మూడు రోజుల సమ్మెకు పిలుపునిచ్చాయి. దీంతో వరుసగా బ్యాంకింగ్ సేవలకు అంతరాయం కలగకుండా సెప్టెంబర్ 27, ఆదివారం ప్రభుత్వ రంగ బ్యాంకులు, ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు పనిచేయాలని కేంద్రం నిర్ణయించింది. RBI కూడా బ్యాంకు శాఖలు, కార్యాలయాలు, ATM-లింక్డ్ శాఖలు, కరెన్సీ చెస్ట్‌లు పనిచేసేందుకు అనుమతించింది.
సమ్మె సమయంలో నగదు లావాదేవీలు, చెక్ సేవలు, ఇతర బ్రాంచ్ కార్యకలాపాలకు అంతరాయం కలగవచ్చు. అయితే UPI, మొబైల్, ఇంటర్నెట్ బ్యాంకింగ్, ATM సేవలు అందుబాటులో ఉండే అవకాశం ఉంది. వరుస సెలవులు, సమ్మె కారణంగా బ్రాంచ్ సేవలకు ఐదు రోజుల వరకు అంతరాయం ఏర్పడే అవకాశం ఉండటంతో, అవసరమైన బ్యాంకింగ్ పనులను సెప్టెంబర్ 27న పూర్తి చేసుకోవచ్చు.
“News5am is a digital news platform that delivers crisp and reliable updates. It provides timely coverage of current affairs, sports, entertainment, business, and technology”.
Internal Links:
అమెరికా మళ్లీ యుద్ధం మొదలుపెట్టింది…
ప్రధాని మోదీకి ఇథియోపియా అత్యున్నత పురస్కారం..
External Links:
బ్యాంక్ సమ్మెకు ముందు కీలక నిర్ణయం.. ఆదివారం కూడా బ్యాంకులు ఓపెన్