News5am, Breaking News Telugu News (06/05/2025): బంగారం ధరలు మరోసారి భారీగా పెరిగాయి. ఇటీవల ఒక్కరోజే తులం గోల్డ్ ధర రూ. 3000 పెరిగి ఆశ్చర్యం కలిగించిన సంగతి తెలిసిందే. తాజాగా బంగారం ధరలు మరింత పెరిగి, నేడు తులం బంగారంపై రూ. 2,730 పెరిగింది. దీంతో 24 క్యారెట్ల బంగారం 1 గ్రాము ధర రూ. 9,846కు, 22 క్యారెట్ల బంగారం 1 గ్రాము ధర రూ. 9,025కు చేరింది. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ. 2,500 పెరిగి రూ. 90,250కి, 24 క్యారెట్ల బంగారం రూ. 2,730 పెరిగి రూ. 98,460కి అమ్ముడవుతోంది. విజయవాడ, విశాఖపట్నం వంటి నగరాల్లోనూ ఇదే ధరలు కొనసాగుతున్నాయి.
మరోవైపు దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 90,400గా, 24 క్యారెట్ల బంగారం రూ. 98,610 వద్ద ట్రేడ్ అవుతోంది. సిల్వర్ ధరలు మాత్రం స్వల్పంగా తగ్గాయి. నేడు కిలో వెండి ధర రూ. 100 తగ్గి, హైదరాబాద్ లో రూ. 1,07,900 వద్ద ట్రేడ్ అవుతోంది. ఢిల్లీలో కిలో వెండి ధర రూ. 96,900గా ఉంది.
More News:
Breaking News Telugu:
ఓటీటీలోకి వచ్చేస్తున్న రీసెంట్ డిజాస్టర్..
మెట్రో ఛార్జీల్లో పెంపు సంకేతాలు..
More Breaking Big News: External Sources
Gold Rates: బంగారం ధరలకు రెక్కలు.. రూ. 2700 పెరిగిన తులం గోల్డ్ ధర