Sep-15 Gold Rate

News5am, Breaking Telugu News (02-06-2025): బంగారం ధరలు నేడు స్థిరంగా ఉన్నాయి. జూన్ 2వ తేదీ సోమవారం నాటి ధరలను పరిశీలిస్తే, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 97,343 కాగా, 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 89,233 పలికింది. అలాగే ఒక కిలో వెండి ధర రూ. 97,280 గా ఉంది. బంగారం ధరలపై అంతర్జాతీయ పరిస్థితులు ప్రభావం చూపుతున్నాయి. ముఖ్యంగా అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లపై తీసుకునే నిర్ణయం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. వడ్డీ రేట్లు తగ్గితే కంపెనీలు పెద్ద మొత్తంలో డబ్బులు పొందుతాయి. దీని వల్ల స్టాక్ మార్కెట్లు లాభాల్లోకి వెళ్లే అవకాశం ఉంటుంది. దీంతో బంగారం ధరలు తగ్గే అవకాశం ఉంది.

గత ఏడాది జూన్ నెలలో బంగారం ధర సుమారు రూ. 75,000 సమీపంలో ఉండగా, ఇప్పటికీ ధర రూ. 1 లక్షను దాటి వచ్చి ఇప్పుడు కొంచెం తగ్గుతూ వస్తోంది. అంటే ఒక్క సంవత్సరం కాలంలో బంగారం ధరలు దాదాపు 25% నుంచి 30% వరకు పెరిగినట్లు గమనించవచ్చు. ప్రస్తుతం బంగారం ధరలు ఆల్ టైం రికార్డు స్థాయితో పోలిస్తే సుమారు రూ. 3000 తక్కువగా ఉన్నాయి.

More Updates:

Today Telugu News:

తులం బంగారం ఏకంగా రూ.5000 తగ్గింది..

భారీగా తగ్గుతున్న బంగారం ధర..

More Breaking Telugu News: External Sources

భారీగా తగ్గిన బంగారం ధర…జూన్ 2, సోమవారం పసిడి ధరలు ఇవే…తులం బంగారం రూ. 3000 తక్కువగా పలుకుతోంది…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *