Sep 06-Gold and Silver Rates

News5am, Latest News Breaking (30-05-2025): మే 30వ తేదీ శుక్రవారం బంగారం ధరలు ఇలా ఉన్నాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 97,110 పలికింది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 88,950 పలికింది. ఒక కేజీ వెండి ధర రూ. 1,03,000 పలికింది. బంగారం ధరలు ఆల్ టైం రికార్డ్ స్థాయి నుంచి ఇంకా 4,000 రూపాయలు తక్కువగా ట్రేడ్ అవుతున్నాయి. పసిడి ధరలు గత రెండు రోజులుగా తగ్గుముఖం పడుతున్నాయి. బంగారం ధరలు ఒక దశలో 99 వేల రూపాయల వరకు ఈ గత వారం వెళ్ళినట్లు గమనించవచ్చు. కానీ అక్కడ నుంచి నెమ్మదిగా బంగారం ధరలు తగ్గడం ప్రారంభించాయి.

ఈ వారం ప్రారంభంలో బంగారం ధరలు పెరిగినప్పటికీ మళ్లీ స్వల్పంగా తగ్గడం ప్రారంభించాయి. ప్రస్తుతం పెళ్లిల సీజన్ కావడంతో బంగారం ఆభరణాలు కొనుగోలు చేసే వారికి తగ్గిన ధరలు కాస్త ఉపశమనం కల్పిస్తున్నాయి అని చెప్పవచ్చు. అయితే బంగారు ఆభరణాలు ప్రస్తుతం కొనుగోలు చేయాలంటే పెరిగిన ధరల కారణంగా పసిడి ప్రియులు ఇబ్బంది పడుతున్నారు అని చెప్పవచ్చు. గత సంవత్సరంతో పోల్చి చూస్తే బంగారం ధరలు భారీగా పెరిగాయి. గత సంవత్సరం మే నెలలో 75 వేల రూపాయల సమీపంలో బంగారం ధర ఉంది. దాంతో పోల్చి చూసినట్లయితే ప్రస్తుతం బంగారం ధర దాదాపు ఒక లక్ష రూపాయల సమీపం వరకు చేరుకుంది.

More Latest News Breaking:

Latest News Breaking:

తెలుగు రాష్ట్రాల్లో తులం బంగారం ఎంత ఉందంటే..

భారీగా తగ్గిన బంగారం ధర..

More Latest News Breaking: External Sources

భారీగా తగ్గుతున్న బంగారం ధర…మే 30, శుక్రవారం తులం పసిడి రూ. 4000 తక్కువగా పలుకుతుంది.. పెళ్లిళ్ల సీజన్లో ఇక పండగే..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *