Indian Stock Market

News5am, Latest Telugu News (29-05-2025): దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు లాభాల్లో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి వచ్చిన సానుకూల సంకేతాలు, ముఖ్య రంగాల షేర్లలో కొనుగోళ్ల మద్దతు కారణంగా సూచీలు పైకి ఎగిశాయి. సెన్సెక్స్ 320 పాయింట్లు పెరిగి 81,633 పాయింట్ల వద్ద ముగిసింది. నిఫ్టీ 81 పాయింట్లు లాభపడి 24,833 పాయింట్ల వద్ద స్థిరపడింది. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ. 85.50 వద్ద ముగిసింది.

సెన్సెక్స్ 30 సూచీలో ఇండస్‌ఇండ్ బ్యాంక్, సన్‌ఫార్మా, అదానీ పోర్ట్స్, ఎటర్నల్, టాటా స్టీల్, టెక్ మహీంద్రా, యాక్సిస్ బ్యాంక్, కోటక్ మహీంద్రా బ్యాంక్, టాటా మోటార్స్, ఇన్ఫోసిస్, ఎం అండ్‌ ఎం, పవర్‌గ్రిడ్ కార్పొరేషన్, మారుతీ సుజుకీ లాంటి షేర్లు లాభాల్లో ముగిశాయి. అయితే బజాజ్ ఫైనాన్స్, ఐటీసీ, బజాజ్ ఫిన్‌సర్వ్, ఏషియన్ పెయింట్స్, టీసీఎస్, ఎన్టీపీసీ షేర్లు నష్టాలు చవిచూశాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో బ్రెంట్ క్రూడ్ ఆయిల్ బ్యారెల్ ధర $65.84 వద్ద, బంగారం ఔన్సు ధర $3,282 వద్ద కొనసాగుతోంది.

More Latest Telugu News Business:

Latest Telugu News:

ఐటీఆర్ దాఖలుకు చివరి తేదీని జూలై 31, 2025 నుండి పొడిగించారు..

సెన్సెక్స్ 500 పాయింట్లు లాభపడింది, నిఫ్టీ 25,000 పాయింట్లను దాటింది..

More Latest Telugu: External Sources

సూచీలకు కొనుగోళ్ల బలం… లాభాలతో ముగిసిన దేశీయ మార్కెట్లు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *