Gold Cost today: అంతర్జాతీయ మార్కెట్‌లో కొనుగోళ్లు పెరగడంతో సోమవారం (జులై 27) దేశంలో బంగారం ధరలు భారీగా పెరిగాయి. ఎంసీఎక్స్‌లో 10 గ్రాముల బంగారం ధర రూ.1.44 లక్షల మార్కును తాకగా, కిలో వెండి ధర కూడా పెరిగి రూ.2,24,500 వద్ద ట్రేడైంది. ఇటీవల తగ్గిన బంగారం, వెండి ధరలు ఇప్పుడు మళ్లీ పుంజుకుంటున్నాయి. అమెరికా–ఇరాన్ ఉద్రిక్తతలు తగ్గడం, ముడి చమురు ధరలు పడిపోవడం, అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్ల నిర్ణయంపై ఉన్న అంచనాలు ఈ పెరుగుదలకు ప్రధాన కారణాలుగా నిలిచాయి.
ఈరోజు 24 క్యారెట్ల బంగారం గ్రాముకు రూ.14,586, 22 క్యారెట్ల బంగారం రూ.13,370, 18 క్యారెట్ల బంగారం రూ.10,939గా నమోదైంది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,45,860, 22 క్యారెట్ల ధర రూ.1,33,700, 18 క్యారెట్ల ధర రూ.1,09,390గా ఉంది. హైదరాబాద్, వరంగల్, కరీంనగర్, ఖమ్మంతో పాటు విజయవాడ, విశాఖపట్నం, అమరావతి, గుంటూరు, తిరుపతి తదితర తెలుగు రాష్ట్రాల ప్రధాన నగరాల్లో ఇదే ధరలు కొనసాగుతున్నాయి. ఇక వెండి ధర మాత్రం స్థిరంగా ఉండి గ్రాముకు రూ.240, కిలోకు రూ.2,40,000గా ఉంది.
“News5am is a digital news platform that delivers crisp and reliable updates. It provides timely coverage of current affairs, sports, entertainment, business, and technology”.
Internal Links:
అమెరికా మళ్లీ యుద్ధం మొదలుపెట్టింది…
ప్రధాని మోదీకి ఇథియోపియా అత్యున్నత పురస్కారం..
External Links:
మళ్ళీ భగ్గుమన్న బంగారం ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో తులం ధర ఎంతంటే..!