Sensex nifty surge with gains: ముడి చమురు (క్రూడ్ ఆయిల్) ధరలు భారీగా తగ్గడంతో సోమవారం (జులై 27) భారత స్టాక్ మార్కెట్ లాభాలతో ప్రారంభమైంది. సెన్సెక్స్ 500కు పైగా పాయింట్లు పెరిగి 76,608.98 వద్ద, నిఫ్టీ 160.95 పాయింట్లు ఎగిసి 23,928.40 వద్ద ట్రేడింగ్ ప్రారంభించాయి. ఐటీ, ఎఫ్‌ఎంసీజీ, మీడియా, ఫైనాన్షియల్ సర్వీసెస్‌తో పాటు ఆటో, బ్యాంకింగ్, రియల్టీ, మెటల్ వంటి అన్ని ప్రధాన రంగాల షేర్లు లాభాల్లో ట్రేడయ్యాయి. ఇన్ఫోసిస్, బజాజ్ ఫైనాన్స్, ఏషియన్ పెయింట్స్, టీసీఎస్, టెక్ మహీంద్రా వంటి కంపెనీల షేర్లు టాప్ గెయినర్స్‌గా నిలిచాయి.
బ్రెంట్ క్రూడ్ ధర 102 డాలర్ల నుంచి 91 డాలర్లకు పడిపోవడం మార్కెట్‌కు ప్రధాన ఊరటనిచ్చింది. మధ్యప్రాచ్య ఉద్రిక్తతలు తగ్గితే మార్కెట్‌లో ఈ జోరు కొనసాగవచ్చని నిపుణులు భావిస్తున్నారు. అలాగే AI, చిప్ స్టాక్స్ ప్రభావంతో విదేశీ పెట్టుబడిదారులు మళ్లీ భారత మార్కెట్‌పై ఆసక్తి చూపే అవకాశం ఉందని తెలిపారు. ఆసియా మార్కెట్లలో జపాన్, హాంకాంగ్ లాభాల్లో ఉండగా, దక్షిణ కొరియా మార్కెట్ నష్టాల్లో ట్రేడైంది. మొత్తం మార్కెట్ లాభాల్లో ఉండగా, భారతీ ఎయిర్‌టెల్ షేరు మాత్రమే స్వల్ప నష్టంతో ట్రేడింగ్ ప్రారంభించింది.
“News5am is a digital news platform that delivers crisp and reliable updates. It provides timely coverage of current affairs, sports, entertainment, business, and technology”.
Internal Links:
అమెరికా మళ్లీ యుద్ధం మొదలుపెట్టింది…
ప్రధాని మోదీకి ఇథియోపియా అత్యున్నత పురస్కారం..
External Links:
స్టాక్ మార్కెట్ కి కలిసొచ్చిన సోమవారం: లాభాలతో దూసుకెళ్తున్న సెన్సెక్స్, నిఫ్టీ!