Cost-Gold & Silver: మధ్యప్రాచ్యంలో జరుగుతున్న యుద్ధం వల్ల ప్రపంచ పరిస్థితులు కొంత అస్థిరంగా మారుతున్నాయి. చమురు, గ్యాస్ ధరలపై ప్రభావం పడే అవకాశం ఉన్నప్పటికీ బంగారం, వెండి ధరలు మాత్రం కొంత తగ్గాయి. పెళ్లిళ్ల సీజన్‌లో ఇది కొనుగోలుదారులకు కొంత ఉపశమనంగా మారింది. ఈరోజు తులం బంగారం ధరపై రూ.770 తగ్గుదల కనిపించగా, వెండి ధర మాత్రం పెద్దగా మారలేదు.
ప్రస్తుతం బులియన్ మార్కెట్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,62,110గా ఉంది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.1,48,600కు, 18 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.1,21,880కు అమ్ముడవుతోంది. వెండి ధర విషయానికి వస్తే, ఢిల్లీ, ముంబై, కోల్‌కతా నగరాల్లో కిలో వెండి రూ.2,85,000గా ఉంది. హైదరాబాద్, చెన్నైలో మాత్రం కిలో వెండి ధర రూ.2,90,000గా కొనసాగుతోంది.
“News5am is a digital news platform that delivers crisp and reliable updates. It provides timely coverage of current affairs, sports, entertainment, business, and technology”.
Internal Links:
పోటాపోటీగా పెరుగుతున్న గోల్డ్ అండ్ సిల్వర్..
External Links:
యుద్ధం వేళ బంగారం, వెండి ధరలు ఇలా..!