గత కొద్ది రోజుల వరకు పెరుగుతూ షాకిచ్చిన బంగారం ధరలు తగ్గముఖం పడుతున్నాయి. రెండు రోజుల నుంచి గోల్డ్ ధరలు దిగొస్తున్నాయి. పసిడి ధరలు తగ్గుతుండడంతో కొనుగోలుదారులు ఊరట చెందుతున్నారు. పుత్తడి ధరలు నేడు పడిపోయాయి. నేడు బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. నేడు తులం బంగారంపై రూ.110 తగ్గింది. బంగారంతో పాటు వెండి ధరలు కూడా తగ్గాయి. నేడు తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం.
హైదరాబాద్ లో ఈరోజు 24 క్యారెట్ల బంగారం ధర (1 గ్రాము) రూ. 8,956, 22 క్యారెట్ల బంగారం ధర (1 గ్రాము) రూ. 8,210 వద్దకు చేరింది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 100 తగ్గడంతో రూ. 82,100 వద్ద అమ్ముడవుతోంది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 110 తగ్గడంతో రూ. 89,560 వద్దకు చేరింది. విజయవాడ, విశాఖ పట్నంలో కూడా ఇదే ధరలు కొనసాగుతున్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 82,250గా ఉంది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. రూ. 89,710 వద్ద ట్రేడ్ అవుతుంది.