తాజాగా పెరుగుతున్న బంగారం ధరలు కాస్త తగ్గినట్లు తెలుస్తోంది. వరుసగా రెండు రోజులు తగ్గిన తర్వాత నిన్న నిలకడగా ఉన్న బంగారం ధరలు, నేడు భారీగా తగ్గాయి. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ.250, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ.270 తగ్గింది. బులియన్ మార్కెట్‌లో సోమవారం (సెప్టెంబర్ 2) 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.66,700గా, 24 క్యారెట్ల బంగారం ధర రూ.72,770లుగా నమోదైంది.
మరోవైపు వెండి ధర కూడా నేడు భారీగా తగ్గింది. బులియన్ మార్కెట్‌లో కిలో వెండిపై రూ.1000 తగ్గి రూ.86,000గా కొనసాగుతోంది. ఈరోజు తెలుగు రాష్ట్రాల్లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.66,700 కాగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.72,770.