గోల్డ్ లవర్స్‌కి వరుస షాకులు తగులుతున్నాయి. దేశంలో తగ్గినట్టే తగ్గిన బంగారం ధరలు భారీగా పెరుగుతున్నాయి. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై నేడు రూ.200 పెరిగింది. 24 క్యారెట్ల బంగారంపై వరుసగా 220 పెరిగింది. గురువారం (అక్టోబర్ 17) బులియన్ మార్కెట్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.71,600గా, 24 క్యారెట్ల ధర రూ.78,110గా నమోదైంది.
ఇటీవలి రోజుల్లో పెరుగుతూ వస్తున్న వెండి ధర నేడు స్థిరంగా ఉంది. బులియన్ మార్కెట్‌లో కిలో వెండి రూ.97,000గా కొనసాగుతోంది. తెలుగు రాష్ట్రాల్లో కిలో వెండి లక్ష మూడు వేలుగా ఉంది. బంగారం, వెండి రేట్లు ప్రాంతాల్ని బట్టి మారుతుంటాయన్న విషయం తెలిసిందే. స్థానికంగా ఉండే పన్ను రేట్లు ఈ ధరల్ని ప్రభావితం చేస్తుంటాయి.