గత కొన్ని నెలలుగా బంగారం ధరలు ‘రన్ రాజా రన్’ అంటూ పరుగు తీస్తున్నాయి. ఇటీవలి రోజుల్లో వరుసగా పెరుగుతూనాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.82వేలు దాటింది. బంగారం ధరల్లో గతంలో ఎన్నడూ లేని విధంగా ఆల్‌టైమ్ హైకి చేరుకుంది. నేడు బంగారం ధరలు స్థిరంగా ఉన్నా, నిన్న రూ.860 పెరిగింది. ప్రస్తుతం బంగారం అంటేనే కొనుగోలుదారులు భయపడుతున్నారు. బులియన్ మార్కెట్‌లో గురువారం (జనవరి 23) 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.75,250గా ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.82,090గా నమోదైంది.
మరోవైపు వెండి ధర స్థిరంగా కొనసాగుతోంది. వరుసగా ఆరో రోజు వెండి ధరలో ఎలాంటి మార్పు లేదు. బులియన్ మార్కెట్‌లో కిలో వెండి రూ.96,500గా కొనసాగుతోంది. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విశాఖ, విజయవాడలో కిలో వెండి ఒక లక్ష నాలుగు వేలుగా ఉంది. దేశంలో అత్యల్పంగా బెంగళూరు, ఢిల్లీ, ముంబైలలో రూ.96,500గా నమోదైంది.