గత కొద్ది రోజులుగా బంగారం, వెండి ధరలు పెరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో బంగారం ధర 80,000 మార్క్‌ను దాటింది. రజతం లక్ష మార్కును దాటింది. అయితే గత వారం రోజులుగా పెరుగుతున్న బంగారం ధరలకు స్వల్ప బ్రేక్ పడింది. నేడు 22 క్యారెట్ల 10 గ్రాములు రూ.550 తగ్గగా, 24 క్యారెట్లు రూ.600 తగ్గాయి. బులియన్ మార్కెట్‌లో గురువారం 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.72,850గా నమోదు కాగా, 22 క్యారెట్ల ధర రూ.79,470గా నమోదైంది.
మరోవైపు వరుసగా పెరుగుతూ వచ్చిన వెండి ధర కూడా దిగొచ్చింది. నేడు బులియన్ మార్కెట్‌లో కిలో వెండిపై రెండు వేలు తగ్గి, ఒక లక్ష రెండు వేలుగా నమోదైంది. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖలో కిలో వెండి ఒక లక్ష పది వేలుగా కొనసాగుతోంది.