గత కొన్ని నెలలుగా బంగారం ధరలు పరుగులు పెడుతున్న విషయం తెలిసిందే. కనీవినీ ఎరుగని విధంగా గోల్డ్ రేట్లు దూసుకెళ్తున్నాయి. ఈ క్రమంలో భారత మార్కెట్‌లో పసిడి కొత్త రికార్డులు సృష్టిస్తోంది. అయితే గత వారం రోజులుగా బంగారం ధరల్లో హెచ్చుతగ్గులు కనిపిస్తున్నాయి. నిన్న పెరిగిన పసిడి, నేడు తగ్గింది. 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడిపై రూ.300, 24 క్యారెట్లపై రూ.330 తగ్గింది. బులియన్ మార్కెట్‌లో మంగళవారం (మార్చి 11) 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.80,200గా, 24 క్యారెట్ల ధర రూ.87,490గా ఉంది. తెలుగు రాష్ట్రాల్లో ఇవే రేట్లు కొనసాగుతున్నాయి.
మరోవైపు వెండి ధరలు కాస్త ఊరటనిస్తున్నాయి. రెండు రోజులు స్థిరంగా ఉన్న వెండి, వరుసగా రెండో రోజు తగ్గింది. బులియన్ మార్కెట్‌లో కిలో వెండిపై రూ.1,000 తగ్గి, రూ.98,000గా నమోదైంది. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విశాఖ, విజయవాడలో కిలో వెండి ఒక లక్ష ఏడు వేలుగా కొనసాగుతోంది.