బంగారం ప్రియులకు శుభవార్త. బంగారం ధరలు తగ్గాయి. ఇటీవల, ఆశ్చర్యకరంగా ఒక రోజు ఎక్కువగా, మరుసటి రోజు తక్కువగా ఉన్న బంగారం ధరలు తగ్గడం ప్రారంభించాయి. ధరలు తగ్గడంతో, కొనుగోలుదారులు బంగారం కొనడానికి మొగ్గు చూపుతున్నారు. ఈరోజు తులంలో బంగారం ధర రూ.440 తగ్గింది. హైదరాబాద్‌లో నేడు 24 క్యారెట్ల బంగారం (1 గ్రాము) ధర రూ.8,978 కాగా, 22 క్యారెట్ల బంగారం (1 గ్రాము) ధర రూ.8,230కి చేరుకుంది.
బంగారంతోపాటు వెండి ధరలు కూడా భారీగా తగ్గాయి. ఇవాళ కిలో వెండిపై రూ. 2000 తగ్గింది. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో ఈ రోజు కిలో వెండి ధర రూ. 1,10,000 వద్ద ట్రేడ్ అవుతోంది. ఢిల్లీలో కిలో సిల్వర్ ధర రూ. 1,01,000 వద్దకు చేరింది.