గోల్డ్ లవర్స్‌కి కాస్త ఊరట కలిగించే విషయమనే చెప్పాలి. వరుసగా రెండు రోజులు భారీగా పెరిగిన బంగారం ధరలు, నేడు స్థిరంగా ఉన్నాయి. బులియన్ మార్కెట్‌లో బుధవారం (ఏప్రిల్ 2) 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.85,100గా ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.92,840గా కొనసాగుతోంది. తెలుగు రాష్ట్రాల్లో కూడా ఇవే ధరలు కొనసాగుతున్నాయి. గత రెండు రోజుల్లో రూ.710, రూ.930 పెరిగిన విషయం తెలిసిందే.
భారత దేశంలో పసిడితో పాటు వెండికీ మంచి గిరాకీనే ఉంటుందన్నా విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో వెండి ధరలను కూడా ఎప్పటికప్పుడు తెలుసుకోవడం ముఖ్యం. నిన్న భారీగా పెరిగిన వెండి ధర నేడు స్థిరంగా ఉంది. బులియన్ మార్కెట్‌లో కిలో వెండి ఈరోజు రూ.1,05,000గా ఉంది. తెలుగు రాష్ట్రాల్లో కిలో వెండి ఒక లక్ష 14 వేలుగా నమోదైంది.