న్యూఢిల్లీ: పెట్రోల్, డీజిల్‌ను జీఎస్టీ పరిధిలోకి తీసుకొచ్చేందుకు జీఎస్టీ చట్టంలో నిబంధనలు ఉన్నాయని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ శుక్రవారం తెలిపారు. ఇది జరగాలంటే జీఎస్టీ కౌన్సిల్‌లో అన్ని రాష్ట్రాలు ఏకతాటిపైకి రావాలని సూచించారు. ప్రస్తుతం పెట్రోల్, డీజిల్‌పై వ్యాట్ విధిస్తున్నారు. వాళ్లు (రాష్ట్రాలు) రేటును నిర్ణయించాలనుకుంటే, వారు కలిసి వచ్చి పెట్రోలియం ఉత్పత్తులను జీఎస్‌టీ పరిధిలోకి తీసుకురావాలని నిర్ణయించుకోవాలి. వస్తే వెంటనే అమలు చేస్తామని సీతారామన్ ఓ ఆంగ్ల ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు. పెట్రోలియం ఉత్పత్తులపై పన్ను రాష్ట్రాన్ని బట్టి మారుతూ ఉంటుంది. పెట్రోల్, డీజిల్‌ను జీఎస్టీ పరిధిలోకి తెస్తే ఆ తర్వాత రాష్ట్రాలు నష్టపోతాయన్నారు.