గత కొన్ని రోజులుగా దూసుకుపోయిన బంగారం ధరలు కాస్తంత తగ్గుముఖం పట్టాయి. 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధరపై 490 రూపాయలు తగ్గింది. దీంతో, హైదరాబాద్లో 24 క్యారెట్ల బంగారం ధర 87,980 రూపాయల నుంచి 87,490 రూపాయలుకు పడిపోయింది. 22 క్యారెట్ల బంగారం ధర కూడా 450 రూపాయలు తగ్గి 80,650 రూపాయల నుంచి 80,2000కు పడిపోయింది.
2025, మార్చి నెలలో ఈ ఆరు రోజుల్లో బంగారం ధరలను పరిశీలిస్తే, మార్చి 1న 220 రూపాయలు తగ్గింది. మార్చి 2, మార్చి 3న బంగారం ధరల్లో ఎలాంటి మార్పు లేదు. మార్చి 4న బంగారం ధర భారీగా పెరిగింది. తులంపై 760 రూపాయలు పెరిగింది. మార్చి 5న కూడా 600 రూపాయలు పెరిగింది. మార్చి 6న 490 రూపాయలు తగ్గింది. వెండి ధర కూడా ఇవాళ వెయ్యి రూపాయలు పెరిగి కిలో లక్షా 8 వేల రూపాయలకు చేరుకుంది.