బంగారం ధరలు మళ్లీ పెరిగాయి. నవంబర్ ప్రారంభం నుంచి క్రమంగా తగ్గుతూ రికార్డు స్థాయికి చేరిన బంగారం ధరలు మళ్లీ పెరుగుతున్నాయి. బంగారం ధరలు వరుసగా రెండో రోజు భారీగా పెరిగాయి. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై నిన్న రూ.600పెరగగా, నేడు రూ.700 పెరిగింది. 24 క్యారెట్లపై నిన్న రూ.660 పెరగగా, నేడు రూ.770 పెరిగింది. బులియన్ మార్కెట్‌లో మంగళవారం (నవంబర్ 19) 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.70,650గా నమోదవగా, 24 క్యారెట్ల ధర రూ.77,070గా నమోదైంది.
ఇటీవలి రోజుల్లో తగ్గుతూ వచ్చి, వరుసగా నాలుగు రోజులు స్థిరంగా ఉన్న వెండి నేడు భారీగా పెరిగింది. మంగళవారం కిలో వెండిపై రూ.2000 పెరిగింది. నేడు బులియన్ మార్కెట్‌లో కిలో వెండి రూ.91,500గా ఉంది. తెలుగు రాష్ట్రాల్లో కిలో వెండి మరలా లక్ష దాటింది. ముంబై, ఢిల్లీ, బెంగళూరు నగరాల్లో రూ.91,500 వేలుగా కొనసాగుతోంది.