బంగారం ధరలు వరుసగా రెండోరోజు ఆకాశాన్నంటాయి. గోల్డ్ ధరలు బెంబేలెత్తిస్తున్నాయి. నేడు మరోసారి పుత్తడి ధరలు భారీగా పెరిగాయి. ఆల్ టైమ్ రికార్డ్ సృష్టించింది. తులం బంగారంపై ఏకంగా రూ.2,940 పెరిగింది. పెరిగిన ధరలు కొనుగోలుదారులకు చుక్కలు చూపిస్తున్నాయి. నేడు తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం. హైదరాబాద్ లో ఈరోజు 24 క్యారెట్ల బంగారం ధర (1 గ్రాము) రూ. 9,338, 22 క్యారెట్ల బంగారం ధర (1 గ్రాము) రూ.8,560 వద్ద అమ్ముడవుతోంది.
హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 2,700 పెరగడంతో రూ. 85,600 వద్ద అమ్ముడవుతోంది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 2,940 పెరగడంతో రూ. 93,380 వద్ద ట్రేడ్ అవుతోంది. ఈ రోజు కిలో వెండి ధర రూ. 1,04,000 వద్ద ట్రేడ్ అవుతోంది.