Stocks Fall

Indian Stock Market Falls: దేశీయ స్టాక్ మార్కెట్ బుధవారం భారీ నష్టాల్లో కొనసాగుతోంది. మంగళవారం ట్రంప్ చేసిన ప్రకటనతో పశ్చిమాసియా యుద్ధం త్వరలో ముగుస్తుందన్న ఆశతో మార్కెట్ మంచి లాభాలు సాధించింది. అయితే ఈరోజు కూడా అదే జోష్ కొనసాగుతుందని నిపుణులు భావించినప్పటికీ, చమురు ధరలు మళ్లీ పెరగొచ్చన్న సంకేతాలతో మార్కెట్ మళ్లీ పడిపోయింది. ప్రస్తుతం సెన్సెక్స్ 390 పాయింట్లు తగ్గి 77,815 వద్ద ఉండగా, నిఫ్టీ 107 పాయింట్లు తగ్గి 24,153 వద్ద కొనసాగుతోంది. నిఫ్టీలో టెక్ మహీంద్రా, రిలయన్స్ ఇండస్ట్రీస్, ఇంటర్‌గ్లోబ్ ఏవియేషన్, జియో ఫైనాన్షియల్, కోల్ ఇండియా లాభాల్లో ఉండగా, కోటక్ మహీంద్రా బ్యాంక్, శ్రీరామ్ ఫైనాన్స్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, అపోలో హాస్పిటల్స్, ఐసీఐసీఐ బ్యాంక్ నష్టాల్లో ఉన్నాయి.

ఇదే సమయంలో మధ్యప్రాచ్యంలో యుద్ధ పరిస్థితులు మరింత తీవ్రంగా మారుతున్నాయి. ఇరాన్‌పై అమెరికా భారీ దాడులు చేయగా, లెబనాన్‌పై ఇజ్రాయెల్ దాడులు కొనసాగిస్తోంది. దీనికి ప్రతిగా ఇరాన్ కూడా దాడులు చేస్తోంది. ఈ ఉద్రిక్త పరిస్థితుల కారణంగా పశ్చిమాసియాలో అస్థిరత పెరిగింది. దీంతో చమురు, గ్యాస్ సరఫరా తగ్గే ప్రమాదం ఉండటంతో ప్రపంచ దేశాలు ఆందోళన చెందుతున్నాయి.

News5am is a digital news platform that delivers crisp and reliable updates. It provides timely coverage of current affairs, sports, entertainment, business, and technology”.

Internal Links:

స్టాక్ మార్కెట్ అల్లకల్లోలం…

దేశీయ మార్కెట్‌కు సరికొత్త జోష్…

External Links:

ఒక్కరోజులోనే ఆశలు ఆవిరి.. భారీ నష్టాల్లో సూచీలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *