దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా మూడో రోజు లాభాల్లో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్ల ప్రతికూల సంకేతాలతో ఈ ఉదయం ఫ్లాట్‌గా ప్రారంభమైన మన సూచీలు ఆ తర్వాత మంచి పనితీరును కనబరిచాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 309 పాయింట్లు పెరిగి 7,044 వద్ద ముగిసింది. నిఫ్టీ 119 పాయింట్లు పెరిగి 23,447 వద్ద స్థిరపడింది.

బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్: ఇండస్ ఇండ్ బ్యాంక్ (7.12%) యాక్సిస్ బ్యాంక్ (4.36%), అదాని పోర్ట్స్ (1.81%), ఏషియన్ పెయింట్ (1.75%), భారతి ఎయిర్ టెల్ (1.35%).

టాప్ లూజర్స్: మారుతి (-1.51%), ఇన్ఫోసిస్ (-1.00%), టాటా మోటార్స్ (-0.92%), ఎల్ అండ్ టీ (-0.90%), ఎన్టీపీసీ (-0.88%).

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *