IPO Gets Massive Bids

IPO Gets Massive Bids: గత కొన్ని వారాలుగా దేశీయ ఇన్వెస్టర్లు ఐపీవోల పట్ల మళ్లీ ఆసక్తిని చూపిస్తున్నారు. అమెరికా పరిపాలనలో గందరగోళం ఉన్నా కూడా ఐపీవో మార్కెట్‌లో మంచి ట్రాక్షన్ కొనసాగుతోంది. ఇటీవల మార్కెట్లోకి వచ్చిన ఐపీవోలు చాలా మంచి లిస్టింగ్ లాభాలు ఇన్వెస్టర్లకు అందించాయి. ఈ నేపధ్యంలో ఇప్పుడు ఎస్‌ఎంఈ విభాగానికి చెందిన స్పన్‌వెబ్ నాన్‌వోవెన్ కంపెనీ ఐపీవో విషయమై ఆసక్తి నెలకొంది. కంపెనీ ఐపీవో బిడ్డింగ్ జూలై 14 నుంచి 16 వరకు జరిగింది. అలాట్మెంట్ ప్రక్రియ నేటి నుంచి ప్రారంభం కానుంది. ఈ ఐపీవో ద్వారా కంపెనీ రూ.60.98 కోట్లు సమీకరించాలని లక్ష్యంగా పెట్టుకుంది.

ఈ ఐపీవోలో షేర్ ధర గరిష్ఠంగా రూ.96గా నిర్ణయించబడింది మరియు లాట్ సైజ్‌ 1200 షేర్లు. బిడ్డింగ్ సమయంలో ఈ ఐపీవోకు 251 రెట్లు మించిన సబ్‌స్క్రిప్షన్ లభించింది. ముఖ్యంగా నాన్-ఇనిస్టిట్యూషనల్ మరియు క్వాలిఫైడ్ ఇన్వెస్టర్లు పెద్ద సంఖ్యలో బిడ్డింగ్ చేశారు. కంపెనీ రూ.61 కోట్లు సమీకరించాలనుకుంటే, ఇన్వెస్టర్లు దానికి బదులుగా దాదాపు రూ.10,000 కోట్లు బిడ్డింగ్ చేశారు. బిడ్డింగ్ ముగిసిన రోజున గ్రేమార్కెట్‌లో ఈ షేర్లు ఇష్యూ ధర కంటే రూ.42 ఎక్కువగా ట్రేడవుతున్నాయి. దీని వల్ల లిస్టింగ్ రోజున ఈ షేర్లు కనీసం 35–40% రాబడిని ఇవ్వవచ్చని అంచనాలు ఉన్నాయి.

Internal Links:

భారత మార్కెట్లు శుక్రవారం వరుసగా మూడో సెషన్‌లోనూ నష్టపోయాయి.

నష్టాల మార్కెట్లో ఐపీవో లాభాల ఎంట్రీ..

External Links:

ఐపీవో వెంటపడ్డ ఇన్వెస్టర్స్.. కంపెనీ అడిగింది రూ.61 కోట్లు, వచ్చిన బిడ్స్ రూ.10వేల కోట్లు..!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *