IPO News: ఆగస్టులో ప్రపంచ వాణిజ్య ఉద్రిక్తతలతో ఈక్విటీ మార్కెట్లు ఒడిదొడుకులకు లోనయ్యాయి. కానీ సెప్టెంబర్ ప్రారంభం నుంచి పరిస్థితి మెరుగుపడింది. ఈ నేపథ్యంలో కరెంట్ ఇన్‌ఫ్రాప్రాజెక్ట్స్ కంపెనీ ఐపీవో భారీ హైప్ సృష్టించింది. నేడు షేర్లు ఇష్యూ ధర కంటే 90% ఎక్కువగా రూ.152 వద్ద లిస్ట్ అయ్యాయి. అయితే తర్వాత లాభాల స్వీకరణ కారణంగా స్టాక్ 4% తగ్గి రూ.145 వద్ద ట్రేడ్ అవుతోంది. ఎస్ఎమ్ఈ కేటగిరీలో లిస్ట్ అయిన ఈ ఐపీవో, ఇన్వెస్టర్లకు మంచి లాభాలను అందించింది. కంపెనీ రూ.41.8 కోట్లను తాజా ఈక్విటీ షేర్ల ద్వారా సమీకరించింది. రిటైల్ ఇన్వెస్టర్ల కోసం ఆగస్టు 26 నుంచి 29 వరకు ఐపీవో అందుబాటులో ఉండగా, ప్రైస్ బ్యాండ్ గరిష్ఠ ధరను రూ.80గా, లాట్ పరిమాణాన్ని 1200 షేర్లుగా నిర్ణయించారు.
ఈ ఐపీవోకు భారీ స్పందన లభించి 380 సార్లు ఓవర్‌సబ్‌స్క్రిప్షన్ నమోదైంది. ముఖ్యంగా నాన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్లు ఎక్కువ ఆసక్తి చూపారు. 2013లో స్థాపించబడిన కరెంట్ ఇన్‌ఫ్రాప్రాజెక్ట్స్ లిమిటెడ్ సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్, వాటర్ ఇంజనీరింగ్ సేవలు అందించే మౌలిక సదుపాయాలు, పునరుత్పాదక ఇంధన రంగ సంస్థ. ఈ కంపెనీ ఇంజనీరింగ్, ప్రొక్యూర్‌మెంట్, కన్స్ట్రక్షన్ సేవల్లో నైపుణ్యం కలిగి ఉండి సోలార్, పవర్, వాటర్, సివిల్ EPC కాంట్రాక్టుల్లో ప్రత్యేక పరిష్కారాలను అందిస్తోంది. అలాగే ఇంటీరియర్ వర్క్స్, రోడ్ ఫర్నిచర్, హాస్పిటాలిటీ రంగాల్లో కూడా సేవలు అందిస్తోంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 12 రాష్ట్రాల్లో కార్యకలాపాలు కొనసాగిస్తోంది.
Internal Links:
సూపర్ లాభాలిచ్చిన మిడ్ క్యాప్స్ ఫండ్స్ ఇవే..
అరగంటలో ఆవిరైన 6 రోజుల లాభాల జోరు..
External Links:
నిమిషాల్లో డబ్బు డబుల్ చేసిన ఐపీవో.. ఇన్వెస్టర్లకు తొలి రోజే సూపర్ లాభాలు