larry ellison: ఒరాకిల్ వ్యవస్థాపకుడు, సీఈఓ లారీ ఎలిసన్ తొలిసారిగా ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడిగా నిలిచారు. గత రెండేళ్లుగా అగ్రస్థానంలో ఉన్న ఎలాన్ మస్క్‌ను ఆయన వెనక్కి నెట్టేశారు. ఒరాకిల్ కంపెనీ ఫలితాలు అంచనాలను మించడంతో ఒక్కరోజులోనే షేర్లు 41 శాతం పెరిగాయి. దీంతో ఎలిసన్ సంపద 101 బిలియన్ డాలర్లు (రూ.8.9 లక్షల కోట్లు) పెరిగి, మొత్తం 393 బిలియన్ డాలర్ల (రూ.34.6 లక్షల కోట్లు)కు చేరింది. ఎలాన్ మస్క్ సంపద 385 బిలియన్ డాలర్లకు (రూ.33.89 లక్షల కోట్లు) తగ్గడంతో రెండో స్థానానికి పడిపోయారు. ఇది చరిత్రలో ఒక్కరోజులో నమోదైన అత్యధిక సంపద పెరుగుదలగా రికార్డు అయింది.
ఎలిసన్ 81 ఏళ్ల వయసులోనూ ఒరాకిల్‌లో భారీ వాటా కలిగి ఉండటం, అలాగే క్లౌడ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ విభాగంపై ఉన్న బలమైన అంచనాలు కంపెనీ షేర్లను ఎగబెట్టాయి. 1999 తర్వాత కంపెనీకి ఇదే అతిపెద్ద రోజువారీ లాభం. మరోవైపు, టెస్లా షేర్లు ఈ ఏడాది 13 శాతం తగ్గి, మస్క్ సంపదపై ప్రభావం చూపాయి. టెస్లా బోర్డ్ 1 ట్రిలియన్ డాలర్ల విలువైన కాంపెన్సెషన్ ప్యాకేజీ ప్రతిపాదించినా, దాన్ని పొందడానికి మస్క్ 10 ఏళ్లు వేచి చూడాలి. ఇదిలా ఉండగా, ఎలిసన్ ఈ ఏడాది జూన్‌లోనే జెఫ్ బెజోస్‌ను అధిగమించి రెండో స్థానానికి చేరుకున్నారు.
Internal Links:
నిమిషాల్లో డబ్బు డబుల్ చేసిన ఐపీవో..
ట్రంప్‌తో మాట్లాడేందుకు నేను రెడీ…