News5am, Latest Breaking News (14-06-2025): బంగారం ధర భగ్గుమని మండింది. జూన్ 14వ తేదీ శనివారం 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,02,630కి చేరింది. అదే సమయంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 93,350గా ఉంది. వెండి ధర కూడా పెరిగింది. ఒక కేజీ వెండి ధర రూ. 1,09,185 పలికింది. గత నాలుగు రోజులుగా బంగారం ధరలు నిరంతరంగా పెరుగుతూనే ఉన్నాయి. ఇప్పుడు బంగారం ధర చరిత్రలో ఎన్నడూ లేని రీతిలో పెరిగింది. మొదటిసారిగా రూ. 1 లక్ష మార్క్‌ను దాటి మరో రూ. 2,000 పెరగడం సంచలనంగా మారింది.
ఈ భారీ పెరుగుదలతో బంగారం ఆభరణాలు కొనుగోలు చేసేవారు బాగా ఇబ్బంది పడుతున్నారు. గతంలో కూడా రెండు సార్లు బంగారం ధర లక్ష రూపాయల మార్క్‌ను తాకినప్పటికీ, ఈ స్థాయికి ఎప్పుడూ చేరలేదు. ఈసారి మాత్రం ఆల్ టైం హయ్యెస్ట్ రికార్డు స్థాయిని దాటి బంగారం ధరలు కొత్త గరిష్ఠాన్ని అందుకున్నాయి. ఈ పెరుగుదలకి ప్రధాన కారణం అంతర్జాతీయ మార్కెట్లో నెలకొన్న అనిశ్చిత పరిస్థితులేనని నిపుణులు భావిస్తున్నారు.
More Telugu News:
Latest Breaking News:
తులం బంగారం ధర ఎంతో తెలిస్తే షాక్ తినడం ఖాయం..
ఈరోజు తులం రేటు ఎంతకు దిగొచ్చిందంటే..
More Latest Breaking News: External Sources
జూన్ 14వ తేదీ శనివారం బంగారం ధరలు ఇవే… ఈరోజు బంగారం ధర ఎంతో తెలిస్తే షాక్ తగలడం ఖాయం…