ఈ మధ్యకాలంలో బంగారాల ధరలు ఆకాశాలు అంటుంటున్నాయి, అయితే బంగారం కొనుగోలు చేయాలనుకుంటున్న మహిళలకు అదిరే శుభవార్త. ఈ ఆగస్టు నెలలో పసిడి ధరలు వరుసగా పెరుగుతూ ఆందోళన కలిగించిన విషయం తెలిసిందే. దీంతో చాలా మంది పసిడి ప్రియులు వెనకడుగు వేశారు. అలాంటి వారందరికీ ఇదే మంచి అవకాశంగా చెప్పవచ్చు. దేశీయ మార్కెట్లో బంగారం ధరలు ఇవాళ దిగివచ్చాయి. అమెరికా నిరుద్యోగిత రేటు గణాంకాల విడుదల, యూఎస్ ఫెడరల్ రిజర్వ్ ఛైర్మన్ జెరోమ్ పావెల్ ప్రసంగంలో వడ్డీ రేట్ల తగ్గింపు ప్రకటన ఉండే అవకాశాల నేపథ్యంలో అంతర్జాతీయ మార్కెట్లలో గోల్డ్ రేట్లు ఆల్ టైమ్ హై నుంచి పడిపోయాయి. ఆ ప్రభావం దేశీయ మార్కెట్లపై పడింది. దీంతో దేశీయంగానూ రేట్లు దిగివచ్చాయి.
నేడు దేశంలో బంగారాల ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం. బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. వెండి ధరలు మాత్రం స్థిరంగా కొనసాగుతున్నాయి. నిన్న పది గ్రాముల బంగారం ధరపై ఐదు వందల రూపాయలు పెరిగింది. మొన్న బుధవారం అయితే ఏకంగా వెయ్యి రూపాయలు పెరిగిన విషయం తెలిసిందే . నేడు పది గ్రాముల బంగారం ధరపై పది రూపాయలు తగ్గింది. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. అయితే ఉదయం ఆరు గంటల వరకే ఈ ధరలు. తర్వాత పెరగొచ్చు. తగ్గొచ్చు. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 66,790 రూపాయలుగా ఉంది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 72,860 రూపాయలకు చేరుకుంది. వెండి మాత్రం స్థిరంగా కొనసాగుతూ ప్రస్తుతం మార్కెట్ లో కిలో ధర 92,080 రూపాయలుగా నమోదయింది.