పసిడి కొనుగోలు చేసేవారికి శుభవార్త. ఇటీవలి రోజుల్లో భారీగా పెరుగుతూ వచ్చిన పసిడి ధరలు, ఇప్పుడు వరుసగా పడిపోతున్నాయి. పసిడి అంటేనే మహిళలు ఫిదా అవుతారు. చీరలను, డ్రెస్ లను ఎంత ఇష్టపడతారో అంతకంటే ఎక్కువ మక్కువ బంగారంపైనే ఉంటుంది. ఏ మాత్రం చిన్న అవకాశం దొరికినా బంగారాన్ని కొనుగోలు చేయడానికి వెనుకాడరు. డబ్బులుంటే వెంటనే పసిడిని కొనుగోలు చేసేందుకు జ్యుయలరీ దుకాణాలకు క్యూ కడతారు.
నేడు దేశంలో బంగారం ధరలు భారీగా తగ్గాయి. వెండి ధరలలో కూడా అదే స్థాయిలో తగ్గుదల కనిపించింది. పది గ్రాముల బంగారం ధరపై రెండు వందల యాభై రూపాయలు తగ్గింది. కిలో వెండి ధరపై తొమ్మిది వందల రూపాయలు తగ్గింది. ఇటీవల కాలంలో ఇంత భారీగా తగ్గడం ఇదే మొదటిసారి అని నిపుణులు చెబుతున్నారు. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 66,690 రూపాయలకు చేరుకుంది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 72,760 రూపాయలుగా నమోదయింది. ఇక కిలో వెండి ధర 85,900 రూపాయల వద్ద ట్రెండ్ అవుతుంది.