News5am, Latest Telugu News (09-06-2025): మన ఇంట్లో ఏ చిన్న శుభకార్యం జరిగినా బంగారం కొనుగోలు చేయడం భారతీయ సాంప్రదాయంలో భాగంగా ఉంటుంది. ప్రత్యేకించి పెళ్లి సీజన్ మొదలైతే బంగారం షాపులు వినియోగదారులతో నిండిపోయి కిటకిటలాడుతుంటాయి. భారత్‌లో బంగారం అంటే మహిళలకు ప్రత్యేకమైన ఆసక్తి ఉంటుంది. బంగారం ధరలు పెరిగినా, తగ్గినా వినియోగదారుల ఉత్సాహంలో మాత్రం ఎలాంటి తగ్గుదల ఉండదు.
తాజాగా జూన్ 9వ తేదీన దేశీయంగా బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. తులం బంగారంపై కేవలం పది రూపాయల తగ్గుదల కనిపించింది. ఇటీవల బంగారం ధర లక్ష రూపాయల మార్కును దాటి, ఆ తర్వాత కొంతవరకు తగ్గి, ఇప్పుడు మళ్లీ ఆ స్థాయికి చేరుకునేందుకు సిద్ధంగా ఉంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 97,960గా, 22 క్యారెట్ల బంగారం ధర రూ. 89,790గా ఉంది. హైదరాబాద్‌లో కూడా అదే ధరలు కొనసాగుతున్నాయి.
More Latest Telugu Big News:
Breaking News:
బంగారం ధర మరోసారి లక్ష రూపాయలు దాటింది – కొనుగోలుదారులకు భారమైన ధరలు
More Latest Gold News: External Sources
తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు ఎలా ఉన్నాయో తెలుసా..?