Price of Gold: బంగారం ధరలు ఒక్క రోజు తగ్గి, మరో రోజు పెరుగుతూ కొనుగోలుదారులను ఆందోళనకు గురిచేస్తున్నాయి. నేటి బులియన్ మార్కెట్‌లో తులం బంగారం ధర రూ. 50 పెరిగింది. వెండి ధరలు మాత్రం మారకుండా స్థిరంగా కొనసాగుతున్నాయి. హైదరాబాద్‌లో ఈ రోజు 24 క్యారెట్ల బంగారం (1 గ్రాము) ధర రూ. 9,933గా ఉండగా, 22 క్యారెట్ల బంగారం ధర రూ. 9,105గా ఉంది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 50 పెరిగి రూ. 91,050కు చేరింది. అదే విధంగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం కూడా రూ. 50 పెరిగి రూ. 99,330 వద్ద ట్రేడ్ అవుతోంది.
విజయవాడ, విశాఖపట్నం వంటి ప్రాంతాల్లో కూడా ఇదే ధరలు కొనసాగుతున్నాయి. ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 91,150గా ఉండగా, 24 క్యారెట్ల ధర రూ. 99,480కి పెరిగింది. వెండి ధరలు స్థిరంగా ఉన్నాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో కిలో వెండి ధర రూ. 1,24,000 వద్దగా ఉంది. ఢిల్లీలో ఇదే కిలో వెండి ధర రూ. 1,14,000 వద్ద ట్రేడ్ అవుతోంది.
Internal Links:
మంగళవారం తగ్గిన గోల్డ్ రేట్లు..
External Links:
స్వల్పంగా పెరిగిన పసిడి ధరలు.. నేడు తులం ఎంతంటే?