Sep-1 Gold and Silver Rates: సెప్టెంబర్ నెల ప్రారంభమవడంతో దసరా పండుగకు ముందే గోల్డ్, సిల్వర్ నగలు, వస్తువులు కొనాలనే ఆలోచనలో తెలుగు రాష్ట్రాల ప్రజలు ఉన్నారు. అయితే అంతర్జాతీయ రాజకీయ పరిస్థితుల కారణంగా ఇన్వెస్టర్లు సేఫ్ హెవెన్ మెటల్స్ వైపు మళ్లుతున్నారు. దీంతో రాబోయే రోజుల్లో బంగారం ధరలు తగ్గుతాయా లేక పెరుగుతాయా అనే ఆందోళన కొనసాగుతోంది. సెప్టెంబర్ 1న 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.930 పెరిగింది. అంటే గ్రాముకు రూ.93 పెరుగుదల నమోదైంది. అలాగే 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.850 పెరిగింది. ఈ ధరలు ఏపీ, తెలంగాణ ప్రధాన నగరాల్లో రిటైల్ మార్కెట్లలో ప్రతిఫలించాయి.
బంగారం ధరలతో పాటు వెండి కూడా పెరుగుదల దిశగా కొనసాగుతోంది. సెప్టెంబర్ 1న కిలో వెండి ధర ఆగస్టు 31తో పోల్చితే రూ.1000 పెరిగింది. దీంతో తెలుగు రాష్ట్రాల్లో స్వచ్ఛమైన వెండి ధర కిలోకు రూ.1,36,000కి చేరుకుంది. గ్రాము వెండి ధర రూ.136 వద్ద ఉంది. దీంతో గోల్డ్, సిల్వర్ ధరలు పెరుగుతున్న నేపథ్యంలో వినియోగదారులు ఆందోళనలో ఉన్నారు.
Internal Links:
ఓరి దేవుడా, బంగారం కొనేదెట్టా..
మళ్లీ బంగారం, వెండి ధరల్లో మార్పులు..
External Links:
కొత్త నెల తొలిరోజున పెరిగిన గోల్డ్ సిల్వర్.. తెలుగు రాష్ట్రాల్లో రేట్లివే..