Sharp Rise in Gold and Silver: పసిడి ప్రియులకు ఈరోజు ధరలు షాక్ ఇచ్చాయి. పశ్చిమాసియా యుద్ధం తర్వాత కొంతకాలంగా తగ్గిన బంగారం, వెండి ధరలు మళ్లీ ఒక్కసారిగా పెరిగాయి. పెళ్లిళ్లు, శుభకార్యాల సమయంలో ధరలు తగ్గడంతో ప్రజలు ఊరట పొందినా, ఇప్పుడు భారీగా పెరగడం ఆందోళన కలిగిస్తోంది. ఈరోజు బంగారం తులానికి రూ.1,970 పెరిగింది, వెండి కిలోకు రూ.5,000 పెరిగింది.
దీంతో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,51,480కి చేరింది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ.1,38,850గా, 18 క్యారెట్లది రూ.1,13,610గా ఉంది. వెండి ధర కూడా పెరిగి, దేశంలోని ఎక్కువ నగరాల్లో కిలోకు రూ.2,55,000గా ఉంది. హైదరాబాద్, చెన్నైలో మాత్రం కిలో వెండి ధర రూ.2,65,000 వరకు ఉంది.
“News5am is a digital news platform that delivers crisp and reliable updates. It provides timely coverage of current affairs, sports, entertainment, business, and technology”.
Internal Links:
పోటాపోటీగా పెరుగుతున్న గోల్డ్ అండ్ సిల్వర్..
External Links:
గోల్డ్ లవర్స్‌కు షాక్.. భారీగా పెరిగిన బంగారం ధరలు