గత కొంతకాలం నుంచి బంగారం ధరలు నాన్ స్టాప్‌గా పరుగులు పెడుతూ, రికార్డు స్థాయికి చేరుకున్నాయి. ఓ దశలో తులం బంగారం రూ.93 వేలకు పైగా దూసుకెళ్లింది. అయితే అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ టారిఫ్స్ బాదుడుతో ఈ 3-4 రోజులుగా పసిడి ధరలు తగ్గుముఖం పడుతున్నాయి. శుక్రవారం, శనివారం తగ్గి నిన్న స్థిరంగా ఉన్న గోల్డ్ రేట్స్, నేడు మరలా తగ్గాయి. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ.250, 24 క్యారెట్లపై రూ.280 తగ్గింది.
బులియన్ మార్కెట్‌లో సోమవారం (ఏప్రిల్ 7) 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.82,850గా ఉండగా, 24 క్యారెట్ల ధర రూ.90,380గా నమోదయింది. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖలో కూడా ఇవే ధరలు కొనసాగుతున్నాయి. గత వారంలో బులియన్ మార్కెట్‌లో కిలో వెండి రూ.1,05,000గా నమోదైన విషయం తెలిసిందే.