2024 కేంద్ర బడ్జెట్ అనంతరం భారీగా తగ్గిన బంగారం ధరలు ఇటీవలి రోజుల్లో వరుసగా పెరుగుతూ వచ్చాయి. మరోసారి ఆల్‌టైమ్ రేట్స్ దిశగా దుసుకుపోయాయి. అయితే గత వారం రోజులుగా పుత్తడి ధరలు తగ్గుతూ వస్తున్నాయి. గత 10 రోజుల్లో ఒకేసారి మాత్రమే బంగారం ధరలో పెరుగదల కనిపించడం విశేషం.
నేడు బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. వెండి ధరలు కూడా కొద్దిగా తగ్గాయి. పది గ్రాముల బంగారం ధరపై పది రూపాయలు తగ్గింది. కిలో వెండి ధరపై వంద రూపాయలు తగ్గింది. హైదరాబాద్ బులియన్ మార్కెట్ లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి. 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 66,690 రూపాయలుగా నమోదయింది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 72,760 వద్ద కొనసాగుతుంది. కిలో వెండి ధర 90,800 రూపాయల వద్ద ట్రెండ్ అవుతుంది. బంగారం ఈరోజు కొనుగోలు చేయడం మంచిది. లేకుంటే ధరలు పెరిగే ప్రమాదముందన్నది నిపుణులు సూచిస్తున్నారు.