దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు రికార్డు స్థాయిలో ముగిసింది. అంతర్జాతీయంగా మిశ్రమ సంకేతాలు ఉన్నప్పటికీ మన మార్కెట్ మాత్రం ఉదయం రికార్డ్ స్థాయిలో ప్రారంభమైంది. చివరిదాకా అన్ని రంగాల సూచీలు భారీ లాభాల్లో దూసుకెళ్లాయి. సెన్సెక్స్ 231 పాయింట్లు లాభపడి 82, 365 దగ్గర ముగియగా, నిఫ్టీ 83 పాయింట్లు లాభపడి 25, 235 దగ్గర ముగిసింది.
సెన్సెక్స్‌లో పవర్ గ్రిడ్ కార్ప్, భారతీ ఎయిర్‌టెల్, ఎం అండ్ ఎం, బజాజ్ ఫైనాన్స్ మరియు సన్ ఫార్మా టాప్ గెయినర్స్‌గా దూసుకెళ్లింది. టాటా మోటార్స్, రిలయన్స్ ఇండస్ట్రీస్, ఐటీసీ, విప్రో మరియు మారుతీ సుజుకీ నష్టపోయాయి. ఎనర్జీ మరియు కన్స్యూమర్ డ్యూరబుల్స్ మినహా అన్ని రంగాల సూచీలు గ్రీన్‌లో ముగిశాయి. బిఎస్‌ఇ మిడ్‌క్యాప్ మరియు స్మాల్‌క్యాప్ సూచీలు వరుసగా 0.5 శాతం మరియు 0.75 శాతం పెరిగాయి.