దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు లాభాల్లో ముగిశాయి. దేశీయ స్టాక్ మార్కెట్‌లో వరుస జోరు కనిపిస్తోంది. ఆసియా మార్కెట్‌లోని సానుకూల సంకేతాలు కలిసి రావడంతో గురువారం లాభాలతో ప్రారంభమైన సూచీలు. చివరి దాకా గ్రీన్‌లో ట్రేడ్ అయ్యాయి. సెన్సెక్స్ 147 పాయింట్లు లాభపడి 81, 053 దగ్గర ముగియగా నిఫ్టీ 41 పాయింట్లు లాభపడి 24, 811 దగ్గర ముగిసింది. ఇక రూపాయి మారకం విలువ డాలర్‌తో పోలిస్తే రూ. 83.93 దగ్గర ముగిసింది.
నిఫ్టీలో గ్రాసిమ్ ఇండస్ట్రీస్, టాటా కన్స్యూమర్ ప్రొడక్ట్స్, టాటా స్టీల్, భారతీ ఎయిర్‌టెల్, ఐసీఐసీఐ బ్యాంక్ ప్రధాన లాభపడగా, టాటా మోటార్స్, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్, ఎన్‌టీపీసీ, విప్రో,ఎం అండ్ ఎం నష్టపోయాయి.