బెంగళూరు: కెనరా బ్యాంక్ 2023-24 ఆర్థిక సంవత్సరానికి డివిడెండ్‌గా రూ.1,838 కోట్ల చెక్కును భారత ప్రభుత్వానికి అందించింది. ఈ చెక్కును కెనరా బ్యాంక్ మేనేజింగ్ డైరెక్టర్ & చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ కె సత్యనారాయణ రాజు అందజేసారు.కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ జాయింట్ సెక్రటరీ డాక్టర్ ప్రశాంత్ కుమార్ గోయల్, బ్యాంక్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు - దేబాశిష్ ముఖర్జీ, అశోక్ చంద్ర, హర్దీప్ సింగ్ అహ్లువాలియా, భవేంద్ర కుమార్ మరియు ఢిల్లీ చీఫ్ జనరల్ మేనేజర్ రాజేష్ కుమార్ సింగ్ సమక్షంలో ఇది జరిగింది.ఈ మొత్తాన్ని అందజేయడం పట్ల రాజు సంతోషాన్ని వ్యక్తం చేస్తూ, “ఈ విజయం కెనరా బ్యాంక్‌లో మా బృందం మొత్తం కృషి మరియు అంకితభావానికి నిదర్శనం. మా వాటాదారులకు విలువను అందించడానికి మరియు దేశ ఆర్థిక పురోగతికి తోడ్పడటానికి మేము కట్టుబడి ఉన్నాము. డివిడెండ్ చెల్లింపు ప్రభుత్వ రంగ బ్యాంకు వాటాదారులలో విశ్వాసాన్ని నింపుతుందని ఆయన అన్నారు.